రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!
- నటుడు విజయ్ 'గోట్' సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్
- ఆ కారు నంబర్ ప్లేట్‌పై 'TN 07 CM 2026' అని ఉండటంతో పెరిగిన ఆసక్తి
- రెండేళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
- తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి అనూహ్య విజయం
- త్వరలో తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టే అవకాశం
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) సంచలన విజయం సాధించిన వేళ, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్ 2026లో ముఖ్యమంత్రి అవుతారని రెండేళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 2024లో విడుదలైన 'G O A T' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలోని ఓ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ కావడమే.
ఈ క్లిప్‌ను నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ ఒక కారులో కూర్చుని ప్రేమ్‌జీతో సరదాగా మాట్లాడుతుంటారు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్. దానిపై 'TN 07 CM 2026' అని స్పష్టంగా కనిపిస్తుంది. దీని అర్థం 'తమిళనాడు, చీఫ్ మినిస్టర్, 2026' అని వ్యాఖ్యానిస్తూ, "అప్పుడే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారు" అని ప్రేమ్‌జీ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు వెంకట్ ప్రభు నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చారు. 2024లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.